గతంలో హైదరాబాద్ మరియు పెద్ద పెద్ద పట్టణ ప్రాంతంలో మాత్రమే వినిపించే ద్విచక్ర వాహనదారుల సైలెన్సర్ పెద్ద పెద్ద శబ్దాలతో ప్రజలను భయ ఆందోళనకు గురి చేసేవారు. అలాంటి శబ్దాల వల్ల ముసలివారికి గుండె జబ్బులు కలవారికి చిన్నపిల్లలకు ప్రాణహాని ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కాగా పెద్ద పెద్ద పట్టణాలలో నుంచి నేడు మన జమ్మికుంట ప్రాంతంలో కూడా అలాంటి శబ్దం గల వాహనాలు ఒకేసారి బాంబు పేల్చినట్టు శబ్దం రావడం విన్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అట్టి వాహనాలు నడిపే వారికి పైశాచిక ఆనందం కలిగినప్పటికీ పట్టణ ప్రజలకు ముసలి వారికి చిన్న పిల్లలకు గుండె జబ్బులు కలవారికి ప్రాణహాని జరుగుతుందన్న విషయం మరిచి జమ్మికుంట పట్టణంలో అలాంటి పెద్ద పెద్ద శబ్దాలు గల వాహనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇట్టి వాహనాలపై ప్రత్యేక నిఘాలు పెట్టి అదుపులోకి తీసుకోవాలని. పట్టణ ప్రజలు మేధావులు యువకులు. పోలీస్ శాఖను కోరుతున్నారు..