గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం, ఇందిరమ్మ కాలనీ గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) రచన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా ఇందిరమ్మ కాలనిలో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామంలోని కొంతమంది మహిళలకు చీరలు పంపిణీ చేసి, అనంతరం గ్రామంలోని, యువతి యువకులతో పాటు గ్రామ పెద్దలతో కేక్ కటింగ్ చేశారు. అనంతరం చోటు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించాడని, గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలనీకి అనేకమైన నిధులు ఇచ్చాడని, తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కు, ఈ ఎస్ ఐ హాస్పిటల్, కేంద్ర విశ్వ విద్యాలయం, కస్తూర్బా గాంధీ పాఠశాల, మోడల్ పాఠశాల తో పాటు అనేక మైన నిధులు ఇచ్చిన ఘనత పొన్నం ప్రభాకర్ దని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్, గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరి వేణు, తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్, మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఆడిగొప్పుల రాము, ఇందిరమ్మ కాలని గ్రామ మాజీ వర్డ్ సభ్యులు దూస మహేందర్, గోరింటాల మాధవి రాజమల్లు, శ్యామ్,శ్రీరామ్ అంబదాస్, ఎన్నాం నరేష్, ఎనగందుల శ్రీకాంత్, చిలుక శ్రీనివాస్, అడిగొప్పుల యమున, జంగంపల్లి భాగ్యలక్ష్మి, సంపతి శ్యామల, లగిశెట్టి లక్ష్మి, దికొండ జ్యోతి, శ్రీగద ప్రవళిక, గోవిందు రమ, మంచాల లావణ్య, కస్తూరి లక్ష్మీ, నిహారిక, ఆకువారి అరుణ, తదితరులు కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.