Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక- శ్రీనివాస్, బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాసుల ఆధ్వర్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి శనివారం రోజున పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే ఎవరు భయపడమని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని ఆరు గ్యారెంటీలు అటకెక్కిందని రైతు రుణమాఫీ 50 శాతం కూడా పూర్తి కాలేదని రైతు భరోసా 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపర ముత్యరాజు, ముక్క రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, మక్కపల్లి కుమార్, కేసిరెడ్డి లావణ్య, మాలపల్లి సుశీల, సీనియర్ నాయకులు వర్తినేని రవీందర్ రావు, ములుగు పూర్ణ చందర్, కొండ్ర నరేష్, ఇమ్రాన్, అమ్జదుల్లా ఖాన్, పంజాల శ్రీధర్, సతీష్, కొయ్యడ శ్రీదేవి, కమలాకర్, దాసరి తిరుపతి, ప్రతాపకృష్ణ, మేడిపల్లి వివేక్, ముక్క పల్లి రమేష్, ఎండి షఫీ, దిల్ శీను, మొలుగు శ్రీను, బొంగొని సంతోష్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments