రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలంలో తేదీ 21 5 2024 రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏ శ్రీనివాసరావు నారాయణపూర్ గ్రామంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా నారాయణపూర్ గ్రామ శివారులోని మానేరు వాగు వద్ద పోలీసు వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో ట్రాక్టర్ రాగా దానిని ఆపి టాక్టర్ డ్రైవర్ అయినా పోదరి రాకేష్ ని వివరాలు అడగగా నారాయణపూర్ అని తెలిపి తాను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్ ఓనర్ అయిన గోగూరి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నానని తెలిపాడు. వెంటనే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు అ ట్రాక్టర్ సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకుకొని వచ్చి ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు