Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAఫిబ్రవరి 14న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి: ఉమా మహేష్.

ఫిబ్రవరి 14న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి: ఉమా మహేష్.

ఈ నెల 14న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆస్బెస్టెస్ గాంధీనగర్ కార్యాలయం వద్ద పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల గత సంవత్సరం 3500 గా ఉన్న క్వింటాల్ బియ్యం నేడు 5500 చేరిందని దానికి ప్రధాన కారణం మోడీ బీజేపీ తీసుకరదల్చుకున్న నూతన రైతు చట్టాల వల్లనేనని,అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడానికి కారణం మోడీ అవలంబిస్తున్న వ్యాపారస్తుల పక్షపాత కారణమని అన్నారు. అన్ని వస్తువులను పండించే రైతులకు మాత్రం ఎలాంటి లాభపడట్లేదని అలాంటి చట్టాలను అడ్డుకొని కనీస మద్దతు ధర కల్పించుకోడానికి సమ్మె నిర్వహిస్తున్నారని అన్నారు.

గతంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే నష్టపరిహారం ఉండేదని కానీ మోడీ తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాల వల్ల అధికారి వచ్చి కార్మికుడు నిజంగానే ప్రమాదవశాత్తు మరణించాడా లేద అని దృవీకరించాకే నష్ట పరిహారం ఇవ్వాలని ఉందని, కార్మికులకు ఉన్న జిత భత్యాల పొడగించుకోడానికి యాజమాన్యంతో బేరసారాలు అడిగే హక్కు కుడా తీసివేసిందని ఇలా కార్మికులకు గల హక్కులను కూడా కలరసిందని కావున ఇలాంటి నల్ల చట్టాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు జరపతలపెట్టిన సమ్మెను అన్ని వర్గాల వారు మద్దత్తు తెలిపి జయప్రదం చేయాల్సిందిగా కోరారు.
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చెయ్యడానికి అన్ని కార్మిక సంఘాలు పానిచేస్తున్నాయని కార్మిక శక్తి ఎక్కువగా ఉన్న కుత్బుల్లాపూర్ లో కూడా సమ్మెను ఘనంగా నిర్వహిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగప్ప, శాఖ అధ్యక్షుడు బాలాజీ, నాయకులు మోహన్ రావు, సలీం, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments