కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డ్ కోరపల్లి రోడ్డులో గల పోలీస్ క్వార్టర్స్ ముందు సర్వే నంబర్ 467 గల తన సొంత భూమిలో నుండి ఒక గుంట భూమిని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం కొరకు విరాళంగా ఇచ్చిన కీ.శే. గొట్టే గోవర్ధన్. తేదీ 5- 4 -2024. శుక్రవారం రోజున ఇట్టి భూమిలో శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కీ.శే లు గొట్టే గోవర్ధన్ కుమారుడు గొట్టే హర్షవర్ధన్ మరియు 16వ వార్డు మెంబర్ కుతాటి రాజయ్య దంపతులు వార్డు సభ్యులు శ్రీరామ్ రాజబాబు తిరుపతి, శ్రీనివాస్, గండికోట సమ్మయ్య, రేవెల్లి సమ్మయ్య, యాదగిరి రమేష్, రేవెల్లి రాజేష్, మురళి, తిరుపతయ్య సేటు, వార్డు సభ్యులు ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు…