వేములవాడ రూరల్ తాహసిల్దార్ కు వినతిపత్రం అందించిన గ్రామస్తులు
ఇసుక రీచ్ తో తమకు ప్రమాదం పొంచి ఉందని వెంటనే ఇసుక తవ్వకాలను ఆపివేసి తమకు న్యాయం చేయాలని తహసిల్దార్ కు వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామస్తులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. బొల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రిచ్ వల్ల గ్రామ చివర్లో ఉన్న ఇళ్లకు, హనుమాన్ ఆలయానికి ప్రమాదం ఉందని వెంటనే ఇసుక తవ్వకాలను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. సైడ్ వాల్స్ కట్టే వరకు ఇసుక తీసుకుపోవడానికి అనుమతించకూడదని తాసిల్దారు కు వినతి పత్రం అందజేశారు. గతంలో కూడా చెక్ డ్యామ్ కూలిపోయి పంటలు ఇల్లు నష్టపోయామని గుర్తు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ పంటలు పొలాలు ఇల్లు నష్టపోవాల్సి వస్తుందని కనుక దీనిని వెంటనే నిలిపివేసి నష్టం వాటిల్లకుండా చూడవలసిందిగా కోరారు