గ్రామ సభ ఏర్పాటు చేయండంటూ బుగ్గారం ఎంపిడివో కార్యాలయంలో ప్రజల దరఖాస్తు
జగిత్యాల జిల్లా బుగ్గారంలో గ్రామ సభ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా సోమవారం వినతి పత్రం తీసుకోకుండా తిరస్కరించి పంచాయతీ కార్యదర్శి నరేందర్ అక్కడి నుండి పారిపోయారు. ఆదివారం బుగ్గారంలో జరిగిన శంఖుస్థాపనలు, మండల కార్యాలయాల గురించి, పోలీస్ స్టేషన్ గురించి, ఆరోగ్య కేంద్రం గురించి, ఇతర కార్యక్రమాల గురించి గ్రామస్థులకు ఎలాంటి సమాచారం లేదని ప్రజలు వాపోయారు. గత గ్రామ సభల తీర్మానాలకు వ్యతిరేకంగా ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వారు ఆరోపించారు. గ్రామం నుండి మండలాన్ని తరలించే యోచనలో పాలకులు ఉన్నారనీ భావిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కార్యాలయాల నిర్మాణం, అభివృద్ది పనుల విషయం, గ్రామంలో ప్రబలుతున్న జ్వరాలు, ఆదివారం నాటి శంఖుస్థాపన ల విషయంపై, ఇతర అంశాలపై గ్రామ సభలో చర్చించి గ్రామస్తుల నిర్ణయం మేరకు తీర్మానాలు చేయాలని వారు కోరారు. అట్టి తీర్మానాల మేరకే పనులు చేపట్టాలని సూచించారు. గ్రామస్థుల కోరిక మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం వెంటనే అత్యవసర గ్రామ సభ ఏర్పాటు చేయాలని కోరుతూ మండల అభివృద్ది అధికారి కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు దసర్తి పూర్ణ చందర్, మాజీ ఎంపిటిసి నగునూరి చిన్న రామ గౌడ్, మాజీ సర్పంచ్ లు కేతి లచ్చయ్య, మసర్తి రాజిరెడ్డి, నీటి సంఘం మాజీ చైర్మన్ పోలంపెల్లి మల్లేశం, గ్రామ అభివృద్ధి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి, కో చైర్మన్ పెద్దనవేని రాగన్న, ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోశాధికారి సీగిరి అంజన్న, నగునూరి నర్సాగౌడ్, నగునూరి వెంకన్న, కళ్లెం హన్మంతు, మసర్తి నర్సయ్య, బోనగిరి రాకేష్, భారతపు సంజీవ్, కొడిమ్యాల రాజన్న, బొడ్డు రవి, కప్పల రాజేందర్, ఎస్పీ రామకృష్ణ స్వామి, అక్కల రాజేష్, మాదాసు రాజేష్, కప్పల పోశన్న, జాబు అశోక్, చింతపండు పోషన్న. దసర్తి మైపాల్, దసర్తి పోషన్న పాల్గొన్నారు.