Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAరెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన హోం గార్డులు

రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన హోం గార్డులు

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రెండు చేతులు జోడించి హోం గార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం హోంగార్డులు మా బతుకు ఇది మా జీవితం ఇది మా హోంగార్డుల గాదా బాధ ఒకసారి ఆలోచించి మీరేనా దయచేసి రెగ్యులరైజ్ చేయండి చాలీచాలని జీతాలతో కుటుంబ జీవనం గడవక, కడుపునిండా తిని తినక మా పిల్లలను సరిగా చదివించలేక అప్పులు చేసి తీర్చుకుంటూ గత 60 , 70 సంవత్సరాల నుండి హోంగార్డులు అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబాలను నెట్టకొస్తున్నారు మా జీవితం మా బాధలు చూసి పుణ్యం కట్టుకోండి మీకు ఎప్పటికీ మేము మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు మీకు జీవిత కాలం రుణపడి ఉంటాం అంటున్నారు హోంగార్డుల

అంతరంగాలు* *హోంగార్డులు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. ఈ బతుకు తప్పేది.
*హోంగార్డుల తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. వీడి జీవితం నా వల్లే పాడైంది.
హోంగార్డుల తల్లి: అయ్యో, నా పిల్లవాడికి స్థిమితమైన జీవితం లేదు,24గంటలు గొడ్డుచాకిరి ,కనీసం విశ్రాంతి లేదు ,శెలవులు లేవు , కదా.
హోంగార్డుల భార్య: పెళ్ళికి ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాల్సింది. అమ్మా నాన్నల మాటవినివుండాల్సింది.
హోంగార్డుల అత్త మామలు: మన కుటుంబంలో ఇంకెపుడూ పోలీసులకు పిల్లనివ్వకూడదు.
హోంగార్ల పిల్లలు: నాన్న ఇంకేదైనా ఉద్యోగం చేసుంటే పండగలు, శెలవులు రోజుల్లో, ప్రతిరోజు సాయంత్రాలు హాయిగా నానతో ఆడుకుని వుండేవాళ్ళం.
హోంగార్డుల పై అదికారులు:- అంతంతమాత్రం చదవులు చదివి హోంగార్డ్ ఉద్యోగంలోకి వచ్చేస్తారు. ఏంపనికి పనికిరారు ఇంకేదైనా పని చూసుకోవాల్సింది.
హోంగార్డుల ఇంటి ఓనరు: జన్మలో హోంగార్డుల కు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు.వేళాపాళాలేకుండా వస్తుంటారు వెళుతుంటారు.

ఇది హోంగార్డుల వెట్టిచాకిరి బ్రతుకులు, విశ్రాంతి లేని జీవితం, చాలిచాలని జీతాలు, కుటుంబ సభ్యులతో సంతోషం లేని బ్రతుకులు, ప్రభుత్వం ప్రకటించిన శెలవులు వాడుకోని జీవితాలు, వెట్టిచాకిరితో అనారోగ్యం, తోటి ప్రభుత్వ ఉద్యోగులు 126రోజులు శెలవులు వాడుకోని జీతాలు తీసుకొంటుంటే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం 10గంటలకు ఆపీసు వచ్చి 1గంటకు బోజనం చేసి మద్యహనం 3గంటలకు ఆఫీసుకు వచ్చి 5గంటలకు ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నాడు ఒక్క హోంగార్డులకు శెలవులు లేవు, 24గంటలు వెట్టిచాకిరి చేసే హోంగార్లను ప్రభుత్వం, రెగ్యులరైజ్ చేయాలి, ఆలోచించాలి వీరికి న్యాయం చేయాలి ఇప్పటికే కథ 70 సంవత్సరాల నుండి వెట్టి చాకిరికి బానిసలమై మా బతుకులు దయని స్థితిలో ఉన్నాయన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments