రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపతి నాయక్, కాంగ్రెపాటీ నాయకుడు అజ్మీర మోహన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో BRS పార్టీ బుగ్గ రాజేశ్వర తండాకు చెందిన యువకులు అజ్మీర రవి నాయక్, BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జ్, అజ్మీర రాజు ప్రధాన కార్యదర్శి, ధరావత్ యూత్ కార్యదర్శి, రాజేందర్, బానోతు శ్రీధర్, భూక్య లాలు, ధరావత్ రాజు, మాలోతు ప్రవీణ్, గుగులోతు నేసిలాల్, రమావత్ రవి, గుగులోతు నరేష్, మెతిలాల్, తిరుపతి లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భముగా అజ్మీర రవి నాయక్ మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా BRS పార్టీకి ఎంత కష్టపడినా తగిన విలువ ఇవ్వకపోగా మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని వాపోయారు, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించడానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, మండల ఉపాధ్యక్షులు గంట బుచ్చ గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి పేటరాజ్ కుమార్, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, గణపతి నాయక్, శ్రీపాల్ రెడ్డి లు పాల్గొన్నారు