మనం చేసిన ప్రతి పనిని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయమని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కు సూచించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలోని జగదాంబ ఫంక్షన్ హల్ లో సిర్పూర్ (T) మరియు కౌటల మండలాల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బూత్ లెవల్ స్థాయి మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ..గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఎన్నికల్లో అధిక మెజారిటీ సాధించాలని కార్యకర్తలకు సూచించారు. బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.