బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ మాట్లాడుతూ రైతులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని కష్టపడి పండించిన పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదని కొన్ని చోట్ల సరైన సమయంలో సాగు నీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం జరిగింది. పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు పరిహారం అందలేదని వెంటనే పరిహారం అందించి రైతులకు ఉపశమనం కలిగించాలని ఒక్కో ఎకరాకు రూ.20 నుండి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చువుతున్నందున ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారం రైతులకు ఏమాత్రం సరిపోదు. కాబట్టి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని జమ్మికుంట తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు..
యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు ప్రారంభమైనందున తక్షణమే పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలని ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలని ప్రతి ఏటా తాలు, తేమ, తరుగు పేరుతో క్వింటాలుకు 4 నుండి 6 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారు. మిల్లర్లతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినందున వెంటనే ఆ మేరకు కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేసారు
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ ను ఏర్పాటు చేయాలని, సమగ్ర పంటల బీమా అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలని, కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలని, పై అంశాలను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే అమలయ్యేలా చూడాలని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని మనవి చేసారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, ఆకుల రాజేందర్, పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, కైలాష్ కోటి గణేష్, మోతే స్వామి, ఇటుకల స్వరూప, తూడి రవిచంద్ర రెడ్డి, బల్సుకురి రాజేష్, ఠాగూర్ రాకేష్, మోడెం రాజు, బూరుగుపల్లి రామ్, కేశ స్వరూప, తదితరులు పాల్గొన్నారు