రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 80లక్షల రూపాయల నిధులతో చేపట్టే మినీ స్టేడియం పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఇటీవల స్థానిక తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఎల్లారెడ్డి పేటలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. మినీ స్టేడియం పనులకు టెండర్లు సైతం పూర్తి కాగా మినీ స్టేడియం నిర్మాణం చేపట్టే స్థలాన్ని కాంగ్రెస్ పత్తి నాయకులు నేడు పరిశీలించారు. మినీ స్టేడియం హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం తరహాలో క్రీడలను వీక్షించడానికి ఆరు వరుసల సీటింగ్ కెపాసిటీతో నిర్మాణం జరుగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, తాజా మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, గంట రమేష్ గౌడ్ లు పాల్గొన్నారు.