మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో ఆలయ డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి . రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్, ఈ. ఓ కృష్ణ ప్రసాద్ దేవాలయ కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.