ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు వాఅలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ యు – న్యూస్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై కేసు నమోదు చేయాలని మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఎక్బాల్ అన్నారు. చిలుక ప్రవీణ్ మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవనీ, ప్రవీణ్ వాడిన భాషను సభ్య సమాజం అసహ్యహించుకుంటుందని ప్రవీణ్ వ్యాఖ్యలు సమాజంలో మతసామరస్యానికి, శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని ముస్లిం సమాజం మనోభావాలను గాయపరుస్తున్నాయని ఇస్లాం ను అవమాన పరుస్తూ చిలుక ప్రవీణ్ మహమ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా వక్ఫ్ బోర్డు పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణ ముస్లిములు, ముఫ్తిలు, మత పెద్దలు, వివిధ మస్జిద్ ఇమాములు, మౌజనులు, భారీ సంఖ్యలో యువత మంగళవారం నాడు చిలుక ప్రవీణ్ పై కేసు నమోదు చేయాలని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారికి దరఖాస్తును సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్, ముఫ్తీ ఆలంగిర్, హఫీజ్ అబ్దుల్ హమీద్, సయ్యద్ అహ్మద్ రీజ్వీ , మహమ్మద్ వాహెద్, అసద్ అలీ ఖాన్, ఫజల్, షేక్ చాంద్, సాబీర్ హుస్సేన్, నదీమ్ ఖాన్, జాకీర్, ముబీన్, ఇలియాస్, ఇర్ఫాన్, సయ్యద్ గోలి ఇమామ్, గయాస్, షౌకత్ అలీ, అలీం, షకీల్, షంషు తదితరులు పాల్గొన్నారు.

