కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామ గౌడ సంఘ భవనానికి మూడు లక్ష రూపాయలు మంజూరు చేశారని ఎల్లారెడ్డిపేట బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులకు ప్రొసిడింగ్ కాపీని గురువారం అందజేశారు. అనంతరం గౌడ సంఘం నాయకులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, బోల్గం శ్రీనివాస్, చందుపట్ల లక్ష్మారెడ్డి, వంగల రాజు, కోనేటి సాయిలు, మంతుర్తి శ్రీను, గౌడ సంఘ నాయకులు నర్సాగౌడ్, రాధాకృష్ణ, అంజయ్య, శ్రీకాంత్ గౌడ్, కిష్టయ్య, వేణు, రంగా గౌడ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.