రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్యారెంటీలను అమలుపడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు గ్యారెంటీలతో నాలుగు గ్యారెంటీలను పేద ప్రజలకు అందించామన్నారు. 500 రూపాయలకే సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు నేటి నుండి అమల్లోకి వచ్చాయన్నారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భారమైన వెనుకడుగు వేయదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు ఆకుల లత, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి పేట రాజ్ కుమార్, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కుమార్, నాయకులు సూడిద రాజేందర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
