అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానులు నిర్లక్ష్య వైఖరితో ప్రజల ప్రాణాలకే ముప్పు అవుతుంది. కొంతమంది నిరుపేదలు వీళ్ళ నిర్వాకం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం మౌలిక వసతులు లేకుండా, కనీసం డీజిల్ పెట్రోల్ కూడా చూసుకున్న పాపాన పోవడం లేదు. టెక్నీషియన్ లేకుండా డబ్బు సంపాదనయే ధ్యేయంగా ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. వేలాది రూపాయలు డిమాండ్ చేసి దండుకుంటున్నప్పటికీ ప్రాణాలకు మాత్రం భద్రత లేదు. వీరి నిర్వహణ వల్ల ఎంతో మంది పేద ప్రజలు తమ కుటుంబ సభ్యులను, కుటుంబ పెద్దలను కోల్పోతున్నారు. ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్న అంబులెన్స్ నిర్వాహకులపై తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారులు చర్యలు తీసుకుని నిరుపేదల ప్రాణాలు గాల్లో కలవకుండా చూడాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ, పరిసర గ్రామాల పేద ప్రజలు కోరుతున్నారు.