నిన్న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ముస్లింలపై విమర్శలు చేయడం, కిషన్ రెడ్డి కూడా కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అనడం రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా ముస్లింలను టార్గెట్ చేసి, రాబోయే రోజుల్లో ఇక్కడి ముస్లింలను కూడా ఉత్తరాది ముస్లింలను వేధించినట్లు వేధింపులకు గురి చేయడానికే అనిపిస్తోందన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్..
కాంగ్రెస్, ముస్లింలు జతగా ఉన్నారని కిషన్ రెడ్డి అనడం ఆయన అవివేకానికి నిదర్శనం. పలు రాష్ట్రాల్లో ముస్లింలు గతంలో ప్రాంతీయ పార్టీల వైపే ఉన్నారు. ప్రస్తుతం కూడా ప్రాంతీయ పార్టీల వైపే ఉంటున్నారు. బెంగాల్లో 90 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించి, ఎలక్షన్ కమిషన్ ను చెప్పుచేతల్లో పెట్టుకొని దొడ్డి దారిన గెలిచి అది ముస్లింలపై గెలుపుగా బిజెపి పార్టీ భావించడం వాళ్ళ అవివేకమని పశ్చిమ బెంగాల్లోని ముస్లింలను బదనాం చేయడానికి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారని నిందలు వేస్తున్నట్లు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ముస్లింలు జత కట్టారని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి తప్పు ముస్లింలు చేసినట్టు భవిష్యత్తులో నిరూపించే ప్రయత్నాలు బిజెపి చేయబోతోందన్నారు.
.
నిజానికి దేశంలోని ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా నష్టపోయారని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వల్ల కూడా ముస్లింలు చాలా నష్టపోతున్నారని రేవంత్ రెడ్డి ముస్లింలపై RSS సిద్ధాంతాలను రహస్యంగా అమలు చేస్తూ ముస్లింల ఆస్తులను ధ్వంసం చేసే పనిలో ఉన్నారని దేశంలోని ప్రతి పార్టీ ముస్లింలను వాడుకుని మోసం చేసిన పార్టీయేనని ఇప్పటికైనా తెలంగాణ లోని ముస్లింలు మేల్కొని ఏదో ఒక పార్టీ వెనుక ఉండకుండా, సొంతంగా తమ అస్తిత్వాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని ఇందుకోసం స్వంత వేదికను తయారు చేసుకునే ప్రయత్నాలు చేయడం మంచిదన్నారు. .
ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం బలంగా ఉంటే వాళ్లకు ముస్లింలకు సంబంధాలు ఉన్నట్టు BJP మతతత్వాన్ని రెచ్చగొట్టడం అలవాటు చేసుకుందని రాష్ట్రాల్లోని పార్టీలను ఓడించే ముందు ఏళ్ల తరబడి ముస్లింలను బద్నాం చేస్తూ, ముస్లింలపై భౌతిక దాడులు చేయడం, ప్రజాస్వామ్య దేశంలో అత్యంత ప్రమాదకరమని ఈ కుట్రను తెలంగాణ ముస్లింలు గమనించి జాగ్రత్త పడాలన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.


