Monday, September 28, 2026
spot_img
HomeTELANGANAప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ: MLA శ్రీగణేష్

ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ: MLA శ్రీగణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 5వ వార్డు ఇంద్రపురి రైల్వే కాలనీ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని దైనందిన జీవితంలో ఉరుకులు, పరుగులతో ప్రజలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని, ఆరోగ్యం బాగుంటేనే మనందరం ఇంకా ఉత్సాహంగా పని చేస్తామని, మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరమని అన్నారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయించి కాలనీ, బస్తీలలో ఉన్న పార్క్ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తుందని, ప్రజలు వీటిని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాలనీ ప్రెసిడెంట్ సాల్మన్, కోశాధికారి సుఖ్ ధామ్, చంద్రశేఖర్, నాయకులు పెద్దాల నరసింహ, నాగేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments