నిన్న బీహార్ రాష్ట్రంలో డాక్టర్ పట్టా పుచ్చుకునే సమయంలో ఒక “ముస్లిం మహిళా డాక్టర్” హిజాబ్ ను లాగి ఆమెను, ఇబ్బందులకు గురి చేస్తూ, వెకిలి నవ్వులు నవ్విన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.
RSS మానసపుత్రిక బీజేపీ పార్టీతో నితీష్ కుమార్ అంటకాగగానే మహిళల పట్ల, ముస్లింల పట్ల చులకన భావం ఏర్పరుచుకొని ముస్లింలను ఇబ్బందులకు గురి చేసే చర్యలకు నితీష్ కుమార్ పాల్పడుతున్నట్లు అర్థమవుతుంది. ఏదో ఒక విధంగా ముస్లింలను అవమానపరచడం, మానసికంగా వేధించడం, వారిపై భౌతిక దాడులు చేయడం, హత్యలు చేయడం తిరిగివాళ్ళ పైనే నిందలు మోపడం, ముస్లింలను జైలు పాలు చేయడం భారతదేశం అంతటా ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినాసర్వ సాధారణమైపోయింది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు మూడు నెలల క్రితం రియాజ్ అనే నిజామాబాద్ కు చెందిన అమాయకుడిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాల్చి చంపడం ఇలాంటి చర్యల కిందికే వస్తుంది. “ముస్లింలను అణచివేయడంలో కేవలం బిజెపి పార్టీయే కాదు, బిజెపి మిత్రపక్షాలే కాదు, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ కూడా ముస్లింలను టార్గెట్ చేసుకొని వారిపై భౌతిక దాడులకు, మానసిక దాడులకు, పాల్పడుతున్నాయి.
ముస్లిం మహిళా డాక్టర్” హిజాబ్ ను లాగి ఆమెను, ఇబ్బందులకు గురి చేస్తూ, వెకిలి నవ్వులు నవ్విన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్య యావత్తు ముస్లిం సమాజ గౌరవ మర్యాదలను కాలరాయడమేనని ఇప్పటికైనా ముస్లిం నాయకులు, ప్రజాస్వామ్యవాదులు కళ్ళు తెరిచి నితీష్ కుమార్ చర్యలను, దేశంలోముస్లింలపై జరిగే దాడులను ఖండించాలన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.


