రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన గ్రామపంచాయతీ సిబ్బందిని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ముద్ర కోల సాయి ప్రేమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రజలు 8 రోజులు బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని అన్ని వసతులు కల్పించడం కోసం పనిచేసిన గ్రామపంచాయతీ సిబ్బందిని శాలువాలతో సత్కరించి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో గొర్రెసాగర్, ఎండి షాకీర్, గడ్డమీది సాయి చందు, చీర్ల రాజు, వంగల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. తాము చేసిన సేవను గుర్తించి సత్కరించిన ముద్ర కోలా ప్రేమ్ సాయి కి యూత్ నాయకులకు కార్మిక నాయకుడు నరపురం నరసయ్య ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి టి రామకృష్ణ, బిల్ కలెక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


