Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్

మంగళవారం కంటోన్మెంట్ కార్యాలయంలో జరిగిన బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ బోర్డు పరిధిలోని పలు అంశాలపై బోర్డు అధికారులతో చర్చించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మొత్తం 8 వార్డులలో ప్రజలకు రోడ్లు,నీటి వసతి, సివరేజ్, ఎలక్ట్రిసిటి లాంటి మౌలిక వసతుల కల్పన బాధ్యత బోర్డుదేనని స్ఫష్టం చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్ లో నిర్మాణాలకు సంబంధించి బిల్డింగ్ బై లాస్, వేసవి కాలం నేపధ్యంలో నీటి సరఫరా, బోర్డ్ పరిధిలోని వాటర్ బోర్ లకు కరెంట్ కనెక్షన్, సర్వీస్ ఛార్జెస్, కంటోన్మెంట్ పరిధిలో చేపడుతున్న పలు అక్రమకట్టడాల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. బోర్డు రెసల్యూషన్స్ లో ఏకపక్షంగా కాకుండా ప్రజల తరపున గొంతు వినిపించడానికి ప్రజా ప్రతినిధులైన ఎంపి, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

బోర్డులో ఉన్న సమస్యలు తీరాలంటే బోర్డు ను జిహెచ్ ఎంసి లో విలీనం చేయడం లేదా తక్షణమే ఎన్నికలు జరిపించాలని అప్పుడే ప్రజలు తమ సమస్యలు చెప్పకోవడానికి అవకాశం ఉంటుందని నామినేటెడ్ మెంబర్ తో పాలన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు. సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయి ఉందో ఖచ్చితంగా తేల్చి, బోర్డు రెసల్యూషన్ పాస్ చేయాలని డిమాండ్ చేశారు. వాటర్ బోర్ లకు కంటోన్మెంట్ బోర్డు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం కుదరదు అని చెప్పడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ అసెంబ్లీలో సాయిబాబా నగర్ లో టాయిలెట్ల నిర్మాణం కోసం మాట్లాడిన నేపథ్యంలో టెండర్ ఖరారయిందని ఆ ప్రాంత ప్రజల సమస్య త్వరలోనే తీరుతుందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

బోర్డు పరిధిలోని 14 ఎకరాల ట్రెంచింగ్ ల్యాండ్ లో డాగ్ కేర్ కు, గోశాలకు రెండు ఎకరాలు కేటాయించినా మిగతా 12 ఎకరాలు కబ్జాకు గురికాకుండా చూడాలని కమర్షియల్ కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు చూడాలని అప్పుడే బోర్డు ఆదాయం పెరిగి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments