Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAతీగలగుట్టపల్లిలో IKP వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

తీగలగుట్టపల్లిలో IKP వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎటువంటి అవంతరాలకు, అక్రమాలకు తావు లేకుండా కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చూడాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి నగునూర్ గ్రామాల మధ్య ఐ.కి.పి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో సరిపడా ప్యాడి క్లీనింగ్ మెషిన్స్ అందుబాటులో ఉంచాలని, సెంటర్లలో వరి ధాన్యాన్ని క్లీనింగ్ చేసి కొనుగోలు చేయాలని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిది వేల కోట్లతో రుణమాఫీ చేశామని రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నరేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం అక్కడే రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి కేక్ కోసి రైతులకు నాయకులకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మూల రవీందర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ మెతుకు శ్యాంసుందర్ రెడ్డి, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాషెట్టి శ్రీనివాస్, మూల ప్రభాకర్ రెడ్డి, మూల రాజిరెడ్డి, జంగపెళ్ళి మల్లయ్య, ఆరెల్లి చంద్రయ్య గౌడ్, మూల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments