Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAపటాన్ చేరు మండలంలోని ప్రవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులతో MLC అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు...

పటాన్ చేరు మండలంలోని ప్రవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులతో MLC అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ముఖ ముఖి

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలంలోని ప్రవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులతో ముఖ ముఖి కలిసి సేవ చేసే మీ సేవకుడిగా ఉండే నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగరని ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఓటర్ నమోదు యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలని ఏ విధంగా ఓటర్ గా నమోదు చేసుకోవాలో కూడా తెలుసుకోవాలని ఓటు యొక్క ప్రాధాన్యతని గుర్తించాలని వివరించారు. మీరందరూ ఓటు వేసి ఆశీర్వదించి ఎమ్మెల్సీ గా గెలిపించి పెద్దల సభకి పంపిస్తే ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి 10 లక్షల రూపాయల ఆరోగ్య భీమా మరియు జీవిత బీమా వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తానని తెలియజేశారు.

ట్రస్మా కుటుంబ సభ్యుడిగా నన్ను గుర్తించoడి మీ వాడిని గెలిపించుకోండి మీకు 6 సంవత్సరాలు సేవకుడిగా ఉంటానని మాట ఇస్తున్నా కరోనా సమయంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను కరోనా కష్ట సమయంలో కేసీఆర్ ప్రభుత్వంతో ప్రేవేట్ ఉపాధ్యాయులకు 25 కేజీల సన్న బియ్యం, 2000 రూపాయలు రాష్ట్ర మొత్తం ఇప్పించానని ప్రశ్నించే వారికి అవకాశం ఇవాలి అని కోరారు. ఉద్యోగులు రిటైర్ అయ్యేవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు వాటి పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఫీజు రీయంబర్స్మెంట్ విషయములో అనేక రకాలైన ఇబ్బందులని యాజమాన్యాలు ఎదుర్కొంటున్నారని విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందక వారు కూడా అనేక రకాలైన ఇబ్బందులని ఎదుర్కొంటున్నారని అటు యాజమాన్యాలకు ఇటు విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్స్ అందేలా కృషి చేస్తానని తెలియజేశారు. ఇప్పటివరకు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో తమ ఓటుని నమోదు చేసుకోలేదో వారిని వెంటనే నమోదు చేసుకోవాలని తనకి తమ సంపూర్ణ మద్దతుని అందించాలని కోరారు

శేఖర్ రావు మాటలకి ఎంతో సంతోషించిన అక్కడి పట్టభద్రులు పుర ప్రముఖులు స్థానికులు ఉపాధ్యాయులు విద్యార్థులు మేము సైతం శేఖర్ రావు తో అని నినాదాలు చేసి తమ సంపూర్ణమైన మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు తో, ట్రస్మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకటేష్, జనరల్ సెక్రెటరీ ఆంథోనీ రెడ్డి, వర్కింగ్ ప్రెసిండెట్ ప్రమోద్ కుమార్, జాయింట్ సెక్రటరీ సతీష్ కుమార్, గీత, శేఖర్, నాగ రమేష్, కరస్పాండెంట్లు, అనేకమంది ఉపాధ్యాయులు, సంగారెడ్డి జిల్లా ట్రస్మా బాధ్యులు, మీడియా ప్రతినిధులు, పుర ప్రముఖులు, పట్టభద్రులు స్థానికులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments