రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ లో గల విలువైన వస్తువులు టివి, ఏసి లు 2, గ్రిజర్ లకు షార్ట్ సర్క్యూట్ ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల ఇందులో గల బాత్ రూం లో చిన్న పాటి విద్యుత్ ప్రమాదం జరగగా స్పందించిన డే కేర్ సెంటర్ ఇంచార్జీ మమత వెంటనే రిపేర్ చేయించారు. కాగ డే కేర్ సెంటర్ లో గతంలో టివి ఒక ఏసి ఉండగా ఎండాకాలం దృష్ట్యా వృద్ధుల సంరక్షణ కోసం మరో ఏసి నీ జిల్లా అధికార యంత్రాంగం మంజూరు చేయగా దానిని ఇటీవలే బిగించారు. అంతేకాకుండా వీరు స్నానాలు చేయడానికి వీలుగా గ్రీజర్ కూడా ఏర్పాటు చేశారు. కాగ ఇటీవల వరుసగా పెద్దబడి ఏరియాలో హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా కాగ కూలర్లు, ఫ్యాన్లు కాలిపోయి సుమారు 25లక్షల మేర ఆస్థి నష్టం వాటిల్లింది. ఇట్లాంటి దురదృష్ట సంఘటన జరగక ముందే మీరు స్పందించి వైర్ల కు అల్లుకున్న చెట్ల కొమ్మలను తొలగించాలని లేని పక్షంలో లక్షల రూపాయల విలువ చేసే ఎల క్ట్రానిక్ వస్తువులు కాలిపోయే ప్రమాదం ఉందని డే కేర్ సెంటర్ ఇంచార్జీ మమత స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లగా ఇట్టి సెంటర్ ను సందర్శించడం జరిగింది విలువైన వస్తువులు కరెంట్ ప్రమాదానికి గురికాకుండా వైర్ల కింద ఉన్న ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి డే కేర్ సెంటర్ లో ఎలక్రానిక్ వస్తువులను కాపాడాలని స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామ ప్రత్యేకాధికారి సత్తయ్యకు పంచాయతీ కార్యదర్శి దేవరాజు కు సెస్ ఏ ఈ కి ఒగ్గు బాలరాజు యాదవ్ విన్నవించారు.


