యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమ మరియు విమోచన కృపను ధ్యానిస్తూ ప్రగాఢమైన భక్తి శ్రద్ధలతో లైఫ్ ఛేంజింగ్ రివైవల్ చర్చ్ – పి.జే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని KJR గార్డెన్స్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏసుక్రీస్తు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారంటే సకల మానవాళి కష్టాలను తన కష్టంగా భావించి తన ప్రాణాలను లోకకల్యాణం కోసం తృణప్రాయంగా త్యాగం చేసిన ఏసుక్రీస్తు మళ్ళీ ఈస్టర్ సండే రోజు తిరిగి వస్తాడనే నమ్మకంతో భక్తులు ఉంటారని అన్నారు. సిలువపై యేసు క్రీస్తు ప్రభువు చేసిన త్యాగంలో మూర్తీభవించిన ప్రేమ, నిరీక్షణ, క్షమాపణ, శాంతి వంటి విలువలను శాంతి ర్యాలీలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే వివరించి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆ విలువలను పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో జీవనం కొనసాగించాలని చెప్పారు


