Wednesday, September 16, 2026
spot_img
HomeTELANGANAకంటోన్మెంట్ లో రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ లో రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గం లోని మారేడ్ పల్లి, పికెట్ లలోని మజీద్ లలో ప్రభుత్వం రంజాన్ పండుగను పురస్కరించుకుని అందజేస్తున్న రంజాన్ తోఫాలను ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం స్థానిక నాయకులు, ముస్లిం పెద్దలుతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాణ్యత లేని కానుకలను అందజేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి ముస్లిం సోదర సోదరీమణులు గౌరవంగా, ఆనందంగా పండుగను జరుపుకోవాలనే మంచి ఉద్దేశంతో నాణ్యమైన కానుకలను అందజేస్తుందని తెలిపారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, గణేష్ టెంపుల్ ఛైర్మన్ ప్రభాకర్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, వైష్ణవి యాదవ్, శ్యామ్ సుందర్ రెడ్డి, నర్సింగరావు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments