Wednesday, September 16, 2026
spot_img
HomeTELANGANAపేద మధ్యతరగతి ముస్లిం సోదర సోదరీమణులకు ఉపయుక్తంగా రంజాన్ తోఫా

పేద మధ్యతరగతి ముస్లిం సోదర సోదరీమణులకు ఉపయుక్తంగా రంజాన్ తోఫా

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం తాడు బందు మజీద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులు ఆనందంగా పండుగను జరుపుకోవాలనే మంచి ఉద్దేశంతో అవసరమైన సరుకులను అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందజేయడం సంతోషంగా ఉందని ఈ పథకం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ముస్లిం సోదర సోదరీమణులకు ముందస్తు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, అబీద్, కరణ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments