Wednesday, September 16, 2026
spot_img
HomeANDHRA PRADESHగ్రామ షాదిఖాన /ఉర్దూ ఘర్ నిర్మాణ పనులు పూర్తి చేసేది ఎప్పుడు?

గ్రామ షాదిఖాన /ఉర్దూ ఘర్ నిర్మాణ పనులు పూర్తి చేసేది ఎప్పుడు?

షాదిఖానా/ఉర్దూ ఘర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మార్కాపురం జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేశారు. మార్కాపురం పట్టణం నడిబొడ్డున ఉన్న షాదిఖాన/ఉర్దూ ఘర్ నిర్మాణం పనులు రెండు దశాబ్దాలు అయినా ఇంతవరకు పూర్తి కాకపోవడం చాలా సిగ్గుచేటని ప్రభుత్వాలు మారుతున్నా ఎన్నికల సమయంలో వాగ్దానాలు అయితే చేస్తున్నారు కానీ పనులు చేయలేకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 6090 కోట్లు నిధులను ఈసారి కేటాయించిందని ఈసారైనా ఈ షాదిఖాన భవన నిర్మాణం పనులు పూర్తి అవుతాయా అన్నారు. మార్కాపురం పట్టణంలో దాదాపు 30 వేల మైనారిటీ ముస్లింలు నివసిస్తున్నారని వీరిలో అత్యధికులు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు తమ రోజువారి జీవనం మెకానిక్ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు, కూలీ పనులు చేసుకుని జీవనం గడిపేవారు అత్యధికంగా ఉన్నారని తమ ఇళ్ల దగ్గర వివాహాలు, శుభకార్యాలు చేసుకొనేందుకు తగిన స్థలాలు లేక ఫంక్షన్ హాల్ లో పెళ్లిళ్లు చేసుకునే ఆర్థిక స్తోమత లేక రెండు దశాబ్దాలుగా మైనార్టీ సోదరులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఈ షాది ఖాన నిర్మాణం కోసం మూడు సార్లు శంకుస్థాపనలు చేసిన ఇంతవరకు నిర్మాణం పనులు పూర్తి కాకపోవడం మైనారిటీల పట్ల ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందని తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని షాదిఖానా నిర్మాణానికి సంబంధించి దాదాపు దశాబ్ద కాలం అవుతున్న ఇంతవరకు పూర్తి కాలేదని ప్రస్తుతానికి చెత్తాచెదారం వేసే డస్ట్ బిన్ లాగా మారిందని ఈ గ్రామంలో దాదాపు 800 మంది మైనార్టీ ముస్లిం సోదరులు ఉంటున్నారు వీరు తమ రోజువారి జీవన ఉపాధి కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని తర్లుపాడు మండలంలో అత్యధిక మైనారిటీ సోదరులు ఉన్న గ్రామం ఇదని అన్నారు.

జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ షాది ఖానా నిర్మాణం పనులు పూర్తి చేయకపోతే తమ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదాకి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులకు పిలిపించి మార్కాపురం పట్టణంలో ఉన్న షాది ఖానా నిర్మాణం దగ్గర శాంతియుత ధర్నాకు కూర్చుంటామని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనియెడల 2029 సాధారణ ఎన్నికల్లో మైనారిటీ ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఖాసిం, షేక్ అబ్దుల్లా, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments