Wednesday, December 6, 2023
spot_img
HomeSPORTSసౌదీ చేతిలో ఓటమిపై మెస్సీ

సౌదీ చేతిలో ఓటమిపై మెస్సీ

దోహా: టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. సౌదీ అరేబియా చేతిలో అనూహ్య పరాజయంతో కుంగిపోయింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అర్జెంటీనా టీమ్‌ లాకర్‌ రూమ్‌కు వెళుతుండగా సహచరుల పరిస్థితిని వర్ణిస్తూ… మెస్సీ ఒక్కమాటలో ‘వారు చచ్చిపోయారు’ అని చెప్పాడు. ‘నిజమైతే.. మరణం. జీర్ణించుకోలేని ఓటమి. వరల్డ్‌క్‌పను ఎలా ఆరంభిద్దామనుకున్నాం? ఏం జరిగింది? కానీ, గడచిన దాన్ని మరిచి.. రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా నెగ్గాలో ఆలోచించాలి. అదంతా మా చేతుల్లోనే ఉంది’ అని మీడియాతో మెస్సీ అన్నాడు. లాకర్‌ రూమ్‌లో సహచరులతో గంట గడిపినా.. మెస్సీ వారితో ఏమీ మాట్లాడలేదట. అయితే, తమ జట్టుకు ఏర్పాటు చేసిన బసకు తిరిగి వెళ్తున్న సమయంలో బస్సులో మాత్రం.. మెస్సీ సహచరుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాడని అర్జెంటీనాకు చెందిన పత్రిక రాసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments