అల్ ఖోర్: మైదానంలో ఆడుతున్నది గత టోర్నీ రన్నరప్ జట్టేనా అన్న సందేహాలు కలిగేలా క్రొయేషియా ఆటతీరు సాగింది. తమ ఆరంభ మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. గ్రూప్-ఎ్‌ఫలో భాగంగా బుధవారం మొరాకోతో జరిగిన పోరును క్రొయేషియా 0-0తో పేలవ డ్రాగా ముగించింది. అయితే, క్రొయేషియా ప్రదర్శన అటుంచితే, మొరాకో ఆడిన తీరు అద్భుతమని చెప్పాలి. క్రొయేషియా పలుమార్లు గోల్‌పో్‌స్టపై దాడులకు దిగినా, మొరాకో పటిష్ఠమైన డిఫెన్స్‌తో తిప్పి కొట్టింది. మ్యాచ్ ముగిసే నిర్ణీత సమయానికల్లా ఇరుజట్లు గోల్ సాధించలేకపోయాయి.