Thursday, April 25, 2024
spot_img
HomeANDHRA PRADESHమా రూల్స్‌.. మా ఇష్టం..!

మా రూల్స్‌.. మా ఇష్టం..!

అంతా మా ఇష్టం..! రూల్స్‌ మేమే పెడతాం… అవసరమైదేవాటిని మేమే తొలగిస్తాం…! మమ్మల్ని అడిగేదెవరు..? అన్న ధోరణిలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రవర్తిస్తున్నారు. బయో మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ నిర్వహణ సంస్థ ఎంపిక దగ్గర నుంచి అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) వరకూ అధికారులు నచ్చిన విధంగా కానిచ్చేశారు. మూడేళ్ల కాలానికి రూ.210 కోట్ల విలువైన ప్రాజెక్టు పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అధికారులు… అర్హత లేని కంపెనీకి కొమ్ముకాసి మరీ టెండర్‌ కట్టబెట్టారు. టెండర్‌ నిబంధనలు మార్చే అధికారం లేకపోయినా నిబంధనలు తుంగలో తొక్కుతూ బయోమెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ నిర్వహణ సంస్థపై వల్లమాలిన ప్రేమ కనబరుస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ కోసం ఆరోగ్యశాఖ.. కేరళకు చెందిన ఒక కంపెనీని ఎంపిక చేసింది. సదరు కంపెనీపై ఇతర రాష్ట్రాల్లో అనేక ఆరోపణలునప్పటికీ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఏరికోరి అదే కంపెనీని ఎంపిక చేశారు. ఈ ఏడాది జూలైలో టెండర్‌ ప్రక్రియను పూర్తిచేసి.. ఆ కంపెనీతో ఎంవోయూ చేసుకోవాలని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఏపీఎం్‌సఐడీసీ అధికారులు లేఖ రాశారు. కానీ నవంబరు రెండో వారం వరకూ ఎంవోయూ చేసుకోలేదు.

ఉన్నట్టుండి రెండు వారాల క్రితం సదరు కంపెనీని పిలిపించిన అధికారులు హడావిడిగా ఎంవోయూ చేసుకున్నారు. ఇక్కడే నిబంధనలకు పాతరేశారు. టెండర్‌ నిబంధనల ప్రకారం సదరు కంపెనీ మూడేళ్లకు రూ.10.49 కోట్లకు ఆరోగ్యశాఖ కమిషనర్‌కు బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వాలి. కానీ ఆ కంపెనీ ప్రతినిధులు ఏడాదికి మాత్రమే బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చారు. అయినా అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఎంవోయూ చేసుకున్నారు. మూడు నెలల క్రితం సదరు కంపెనీ తాము ఏడాదికి మాత్రమే బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తామని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయానికి లేఖ రాసింది. అప్పుడు ఆ విన్నపాన్ని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం తిరస్కరించింది. టెండర్‌ నిబంధనల ప్రకారం మూడేళ్లకు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాల్సిందేనని సూచించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ నిబంధన పట్టించుకోకుండా ఎంవోయూ చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. కంపెనీ ఎంపిక ప్రక్రియ దగ్గర నుంచి ఎంవోయూ వరకూ మొత్తం ముడుపుల వ్యవహారమే నడిచిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంవోయూ వ్యవహారంలో ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని సిబ్బంది కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. పేషీలోని ఒక కీలక వ్యక్తి కనుసన్నల్లోనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది. ఏడాది బ్యాంక్‌ గ్యారంటీతోనే ఎంవోయూ చేయించడం వెనుక భారీగా ముడుపులు నడిచినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

అవినీతి ఆరోపణలున్న వారికి పర్యవేక్షణ బాధ్యత

మరోవైపు ఇప్పటికే అనేక ఆరోపణల మధ్య టెండర్‌ ప్రక్రియ, ఎంవోయూ జరిగిపోయాయి. ఇప్పుడు అత్యధిక అవినీతి ఆరోపణలున్న వ్యక్తులకు ఆ ప్రాజెక్టుకు పర్యవేక్షకులుగా నియమించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ, డీహెచ్‌ విభాగాల్లో ఒక్కొక్క బయో మెడికల్‌ ఇంజనీర్‌ని నియమించుకుని వారి ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టులో డీఎంఈలోనే అత్యధికంగా వైద్య పరికరాలు ఉంటాయి. గతంలో ఏపీఎంఎ్‌సఐడీసీలో బయోమెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ టెండర్‌ ప్రక్రియను చూసిన బయో మెడికల్‌ ఇంజనీర్‌నే డీఎంఈ పర్యవేక్షకుడిగా నియమించాలని అధికారులు నిర్ణయించారు. సదరు ఇంజనీర్‌పై గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. మళ్లీ ఇప్పుడు అతన్నే డీఎంఈలోకి తీసుకొచ్చి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అది కేరళకు చెందిన కంపెనీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ బాధ్యత నిర్వర్తిస్తుంటుంది. దీనిపై అనేక రాష్ట్రాల్లో పలు ఆరోపణలున్నాయి. ఆ కంపెనీకి అర్హత లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయినా ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోలేదు. ఏరికోరి మరీ ఆ కంపెనీని తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ బాధ్యత కట్టబెట్టారు. ఈ క్రమంలో టెండర్‌ ప్రక్రియ మొత్తం గోల్‌మాల్‌ చేసేశారు. బయో మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ నిర్వహణ సంస్థ ఎంపిక దగ్గర నుంచి.. ఎంవోయూ వరకూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

గతంలో ఇలా…

ఆరోగ్యశాఖ అధికారులు అండదండలతో సదరు కంపెనీ ఒకడుగు ముందుకు వేసింది. గతంలో టెండర్‌ ఫైనల్‌ అవకుండానే, ఎల్‌1 బిడ్డర్‌గా ఎంపిక కాకముందే సదరు కంపెనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చేసింది. ప్రాజెక్ట్‌ మేనేజన్‌, జోనల్‌ మేనేజర్‌, డివిజనల్‌ మేనేజర్‌, డిస్ట్రిక్ట్‌ ఇన్‌చార్జి, జూనియర్‌ బయో మెడికల్‌ ఇంజనీర్‌, స్పెషలిస్ట్‌ ఇన్‌చార్జి, సర్వీస్‌ కో-ఆర్డినేటర్‌ ఇలా ఏడు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెండర్‌ చేతికి రాకముందే సదరు కంపెనీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారులు భరోసా ఇవ్వడం వల్లే కంపెనీ ముందుస్తు నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్న ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అస్మదీయ కంపెనీ కావడంతో అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు అదే కంపెనీతో ఏడాది బ్యాంక్‌ గ్యారెంటీతోనే ఎంవోయూ చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments