నిబంధనలకు కట్టుబడాల్సిందే

0
24

ముంబై : తామరతంపరగా పుట్టుకొస్తున్న రుణ యాప్‌లు, రుణాల రికవరీకి వారు అనుసరిస్తున్న విధానాల పట్ల అసహనం ప్రదర్శించిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఫిన్‌టెక్‌ రంగంలో కార్యకలాపాలు సా గిస్తున్న కంపెనీలేవైనా నిబంధనలకు కట్టుబడాల్సిందేనని హెచ్చరించారు. మంగళవారం మూడవ ఫిన్‌టెక్‌ అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇలాంటి కంపెనీల నిర్వాహకులకు కళ్లెం వేయడం లేదా వారు అనుసరించే ఇన్నోవేషన్‌ను అడ్డుకోవడం ఆర్‌బీఐ వైఖరి కాదని తేల్చి చెప్పారు. ఫిన్‌టెక్‌ కంపెనీలు ప్రవేశపెట్టే ఇన్నోవేషన్‌ ఏదైనా వారి సామర్థ్యం, సంయమనం పెంచేదిగా ఉండాలని, అలాగే కస్టమర్‌కు కూడా ప్రయోజనకరంగా ఉండాలని దాస్‌ సూచించారు.

ఈ రుణ యా ప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న కొందరు ఆ కంపెనీ ప్రతినిధుల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రుణయా్‌పల దాష్టీకాలను నిలువరించే లక్ష్యంతో ఆర్‌బీఐ అందుకు సంబంధించిన నిబంధనల్లో పలు మార్పులు చేసింది. తాము ఏ ఎన్‌బీఎ్‌ఫసీ లేదా బ్యాంక్‌ తరఫున రుణం ఇస్తున్నదీ ముందుగానే తెలియచేయాలన్న షరతు వాటిలో ఒకటి. వాస్తవానికి ఆర్‌బీఐ డిజిటల్‌ లెండింగ్‌కు మద్దతు ఇస్తుందంటూ ఎవరికి వారే అంతర్గతంగా ఉత్పత్తి, సర్వీస్‌ రెండింటికీ హామీ ఇవ్వాలని  సూచించారు. 

ఉమ్మడి కేవైసీ అమలుకు కృషి

అన్ని రకాల ఫైనాన్సింగ్‌ లావాదేవీలకు ఉమ్మడి కేవైసీ ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘‘కేంద్రీయ కేవైసీ నిర్వహణ బాధ్యతను సెంట్రల్‌ రిపాజిటరీ చేపడుతుంది. అయితే కస్టమర్‌ ఒకసారి కేవైసీ ఇచ్చినట్టయితే దాన్ని అన్ని రకాల లావాదేవీలకు ఉపయోగించుకునే దిశగా మేం కృషి చేస్తున్నాం’’ అని ఆమె తెలిపారు. ఫిక్కీ లీడ్స్‌ 2022 సమావేశంలో మాట్లాడుతూ ఇలాంటి ఉమ్మడి కేవైసీ సామాన్య మానవునికి బ్యాంకు ఖాతా తెరవడం, కొత్త పెట్టుబడి పెట్టడం, కొత్త డీమ్యాట్‌ ఖాతా తెరవడం దేనికైనా పేపర్‌ వర్క్‌ను ఉమ్మడి కేవైసీ తగ్గిస్తుందని మంత్రి అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.