నాన్‌ స్టాప్‌ వీరమల్లు

0
19

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌ దర్శకుడు. ఏ.ఎం.రత్నం నిర్మాత. అక్టోబరు 1 నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. నాన్‌ స్టాప్‌గా సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా కోసం పవన్‌ 50 రోజుల కాల్షీట్లు కేటాయించార్ట. ఈ యాభై రోజుల్లోనే సినిమా మొత్తం పూర్తి చేస్తారు. ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తయింది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. మొగలాయి సామ్రాజ్య నేపథ్యంలో సాగే కథ ఇదని, ఇందులో పవన్‌ కల్యాణ్‌ బందిపోటుగా కనిపించనున్నారని, కోహినూర్‌ వజ్రం చుట్టూ ఈ కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2023 వేసవిలో ‘వీరమల్లు’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.