ధనుష్‌తో ప్రియాంక

0
18

ధనుష్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకుడు. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో కథానాయికలుగా ప్రియాంక మోహన్‌, నివేదిత సతీష్‌లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మోహన్‌ మాట్లాడుతూ ‘‘ఇంత పెద్ద ప్రాజెక్టులో కథానాయికగా అవకాశం రావడం నా అదృష్టం. ధనుష్‌తో కలసి నటించడం ఓ గౌరవంగా భావిస్తున్నా. షూటింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. నివేదిత మాట్లాడుతూ ‘‘నా మనసుకు దగ్గరైన పాత్ర ఈ సినిమాలో దొరికింది. నాపై నమ్మకం ఉంచిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ధనుష్‌ నటుడిగా ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంద’’న్నారు. 1930-1940 మధ్య జరిగే కథ ఇది. సందీప్‌ కిషన్‌ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. జి.వి.ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.