తగ్గనున్న దసరా సెలవులు?

0
16

హైదరాబాద్‌: పాఠశాలలకు దసరా సెలవులు తగ్గే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా జూలై 11 నుంచి 16 వరకూ వారం రోజులపాటు .. జాతీయ సమైక్యతా దినోత్సం సందర్భంగా సెప్టెంబరు 17న.. ప్రత్యేక సెలవులను ప్రకటించడంతో అకడమిక్‌ క్యాలెండర్‌లో 8 రోజులు తగ్గాయి. ఈ నష్టాన్ని పూడ్చడానికి వీలుగా దసరా సెలవులను కుదించాలంటూ.. స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సిఈఆర్‌టి) డైరెక్టర్‌ రాధా రెడ్డి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు ఒక లేఖను రాశారు. దసరా సెలవులను ఈ నెల 26 నుంచి కాకుండా అక్టోబరు 1 నుంచి మొదలుపెట్టి 9వ తేదీ దాకా ఇవ్వాలని అందులో సూచించారు. అలాగే.. బోధన దినాల నష్టాన్ని భర్తీ చేయడానికి వీలుగా ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లోని రెండవ శనివారాల్లో (5 రోజులు) పాఠశాలలు పనిచేసే విధంగా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. ఎస్‌సీఈఆర్‌టి సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే దసరా సెలవులను కుదించడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ముందు నిర్ణయించినట్టుగానే సెలవులు అమల్లో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.