గండిపేటలో 1000 ఎకరాలపై కన్ను

0
16

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

ధరణిలో తప్పుల కారణంగా సోమవారం ఒక్కరోజే నాలుగు జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారని ఈటల ఆవేదన వెలిబుచ్చారు. రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిన కేసీఆర్‌, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 2020 నవంబరులో ధరణిని తీసుకువచ్చారని మండిపడ్డారు. ధరణి కారణంగా భూసమస్యలు పెద్ద ఎత్తున తలెత్తాయని.. సర్వే నంబర్లు తప్పుగా పేర్కొనడం.. పట్టాభూముల్ని అటవీ భూములుగా మార్చడం.. యజమానుల పేర్లు మారిపోవడం వంటి సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు. రికార్డుల్లో తప్పులు సవరించాలని, తమకు న్యాయం చేయాలని గత రెండేళ్లుగా 24 లక్షల మంది రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కేవలం 6 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికీ 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నై. తమ భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. ఒక మహిళా తహశీల్దార్‌పై పెట్రోలు పోసి తగులబెట్టాల్సిన నీచమైన చరిత్రకు కేసీఆరే కారణమని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు వివాదాస్పద భూముల జాబితాలో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని.. లేనిపక్షంలో పరిపాలన చేతగాదంటూ ప్రజలకు క్షమాపణ చెప్పి పదవి నుంచి వైదొలగాలని ఈటల సీఎంను డిమాండ్‌ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.