కువైత్ మరో సంచలన నిర్ణయం.

0
12

కువైత్ సిటీ: ఇప్పటికే వలసదారులను ముప్పుతిప్పలు పెడుతున్న గల్ఫ్ దేశం కువైత్ తాజాగా వారి విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తాజాగా కీలక ప్రకటన చేసింది. వలసదారులు ఎవరైతే వర్క్ పర్మిట్ల పై దేశానికి వచ్చి రెసిడెన్సీ ప్రాసెస్‌ను పూర్తి చేయలేదో వారిపై పరారీ కేసులు మోదు చేయనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగా ‘ఆశల్’ పోర్టల్‌లో కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు పీఏఎం వెల్లడించింది. నివాస విధానాలను పూర్తిచేయని ప్రవాస కార్మికులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పీఏఎం పేర్కొంది. 

దీనిలో భాగంగా ఇప్పటివరకు నమోదైన సుమారు వెయ్యి పరారీ కేసులను తనిఖీ విభాగం అధ్యయనం చేస్తుందని తెలిపింది. ఇక సాధారణంగా తనపై నమోదైన ఫిర్యాదుపై రెండు నెలలలోపు అభ్యంతరం చెప్పే హక్కును కార్మికుడికి చట్టం కల్పించింది. ఈ రెండు నెలలు గడువు దాటితే సదరు కార్మికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అతడి/ఆమె ఫైల్ రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగానికి పంపిస్తారు. అక్కడ నివాస విధానాలను పాటించని కార్మికుడిని దేశం నుంచి బహిష్కరించడంతో పాటు ఇతర చర్యలను అంతర్గత మంత్రిశాఖ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇకపై కువైత్‌లోని వలస కార్మికులు ఈ విషయంలో అప్రమత్తంగా లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకే వర్క్ పర్మిట్లపై కువైత్ వెళ్లే ప్రవాస కార్మికులు వెంటనే రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయడం బెటర్.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.