ఆస్కార్‌ నామినేషన్‌లో గుజరాతీ చిత్రం.

0
19

తెలుగు సినిమా సత్తాను ప్రపంచ దేశాలను చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) షాక్‌ తగిలింది. వరల్డ్‌వైడ్‌గా వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఆస్కార్‌ నామినేషన్‌ రేసులో ఉందనుకున్నారంతా. అయితే ఈ చిత్రానికి ‘ఆస్కార్‌’ (Oscar 2023)నామినేషన్‌లో స్థానం దక్కలేదు. గుజరాతీ సినిమా ‘చలో షో’ (Chhello Show – Last Film Show) చిత్రానికి ఈ అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఈ చిత్రం నామినేట్‌ అయినట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఈ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేసిన దర్శకుడు పాన్‌ నలిన్‌ తన చిత్రాన్ని ఆస్కార్‌కి నామినేట్‌ చేసిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు నలిన్‌ (Nalin )తన ఛైల్డ్‌హుడ్‌ మెమరీస్‌ ఆధారంగా తెరకెక్కించారు. చిన్నతనంలో ఆయన సినిమాలకు ఎలా ఎట్రాక్ట్‌ అయ్యారు.. సినిమాపై ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది అన్న అంశాల ఇతివృత్తమే ఈ సినిమా. గుజరాత్‌లోని గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2020లో నలిన్‌ ఈ చిత్రాన్ని తీశారు. కరోనా కారణంగా డిలే అవుతూ వచ్చింది. కోవిడ్‌ తగ్గిన తర్వాత మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ టైటిల్‌తో గతేడాది జూన్‌లో ‘ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 14న ఈ చిత్రం విడుదల కానుంది. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు నిరాశ..

తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ బరిలో ఉండబోతోందని చాలాకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ్య మ్యాగజైన్‌  దీనిపై కథనం ప్రచురించింది. తెలుగు చిత్రం ‘ఆస్కార్‌’ బరిలో నిలవనుందని, హీరోలు, తారక్‌, చరణ్‌లకు ఆస్కార్‌ దక్కుతుందని అనుకున్నారంతా. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు చోటు దక్కలేదు. అంతే కాదు ఈ చిత్రంతోపాటు పోటీ పడిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు సైతం ఆస్కార్‌లో చోటు దక్కలేదు. 95వ ఆస్కార్‌ వేడుక వచ్చే ఏడాది మార్చి 12న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.